ఇచ్చిన ఉచిత హామీలు గాలికి వదిలి.. ప్రజల నెత్తిన వేల కోట్ల భారం మోపడమేనా సంపద సృష్టి అంటే అని చంద్రబాబుపై దక్షిణ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు శుక్రవారం పలు నియోజకవర్గాలలో చేపడుతున్న విద్యుత్తుపై పోరుబాటలో భాగంగా దక్షిణ నియోజకవర్గం లోని జగదాంబ జంక్షన్ నుండి ఈపీడీసీఎల్ విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి లాంతర్లు పట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు అబద్దాల హామీలతో సామాన్య బతుకులు మళ్ళీ చీకటిలోకి నెట్టబడ్డాయన్నారు. భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎన్నికలలో గెలిచేందుకు ఎన్నో ఉచిత హామీలు చేశారని, వాటిని అమలు చేయడంలో విఫలం అవ్వడమే కాకుండా ప్రజలపై అనేక రకాల పన్నులభారం మోపరని, అలాగే విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని వాసుపల్లి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. .
ఇచ్చిన ఉచిత హామీలు గాలికి వదిలి.. ప్రజల నెత్తిన వేల కోట్ల భారం మోపడమేనా సంపద సృష్టి #vvwnews
47