అసైన్డ్ భూముల ఫ్రీ హెూల్డ్నిర్లక్ష్య బాధితుల సమస్యలను పరిష్కరించాలని #vvwnews

by vvwnews.com

అసైన్డ్ భూముల ఫ్రీ హెూల్డ్
నిర్లక్ష్య బాధితుల సమస్యలను పరిష్కరించాలని నవయానం బహుజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. స్థానిక బుల్లయ్య కాలేజీ ప్రక్కన అంబేద్కర్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 596ద్వారా గత ప్రభుత్వం సుమారుగా 300 మందికి సంబంధించిన 609
ఎకరాలకు ఫ్రీ హెూల్డ్ భూమిని అమ్ముకునే అవకాశం కల్పించిందన్నారు. అసైన్ భూములు గురించి 135 ఎకరాల్లో అవకత ఒకలు జరిగాయనేది ఆరోపణ మాత్రమేనని, అది అవాస్తమని ప్రస్తుత ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ తేల్చేసిందన్నారు.
నాలుగు వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్ కావలసిఉందని, అందులో 171 ఎకరాలు మాత్రమే అమ్ముకోవడం జరిగిందని వివరించారు. దీనిపై ఎవరు మాట్లాడటం లేదని, రాజకీయ పార్టీలు, తమ
రాజకీయ స్వార్థం కొరకు వారికి అనుబంధ గొంతు నాయకులు మాత్రమే అన్యాయం జరిగినట్టుగా ప్రచారం చేస్తున్నారని, విచారణలో అది అవాస్తమని తేలిపోయిందని తెలిపారు. విశాఖ జిల్లాలో సుమారుగా 6,738 ఎకరాలు
భూముంటే, అందులో 609 ఎకరాలకు మాత్రమే ఫ్రీ హెూల్డ్ హక్కు లభించినది తెలిపారు. మిగిలిన వారిలో తమ భూములు అమ్ముకోవడానికి ద్వారా ప్రభుత్వం ఫ్రీ హెూల్డ్ హక్కు మంజూరు చేసి, దీనమైన ఆర్థిక స్థితి మెరుగుపరుచుకొని అవకాశం కల్పించాలని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.

Use Social Media to Spread the Word about Our News

related articles