పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చర్యలు తక్షణమే నిలుపుదలచేసి, పోర్టు సోంత నిధులతో అభివృద్ధి చేయాలని విశాఖపట్నం పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాయి. మంగళవారం జగదాంబ వద్ద నండూరి ప్రసాదరావు భవనంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఏఐటియుసి యూనియన్ ప్రధాన కార్యదర్శి బిసీహెచ్ మసేన్, హెచ్‌ఎంఎస్ యూనియన్ ట్రెజరర్ మంగయ్య నాయుడు, సిఐటియు ఆర్గనైజింగ్ కార్యదర్శి వి రామలింగేశ్వర రావు, విడిఎల్ బిÊ డాక్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జక్కన సత్యనారాయణ, సిఎఫ్‌టియుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.కనకారావు, ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు గొర్లె చందు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ 150 పడకల సామర్థ్యంతో నిర్మించి ప్రస్తుతం 80 పడకలతో సమర్థవంతంగా పోర్టు Ê డాక్ అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు, రిటైర్ అయిన కార్మికులకు, ఫ్యామిలీ పెన్షనర్లకు, పూల్ కళాశీలకు, సిహెచ్‌డి క్యాజువల్ కార్మికులకు మరియు సిఐఎస్‌ఎఫ్ ఉద్యోగులు వారి వారి కుటుంబ సభ్యులకు దశాబ్దాల తరబడి 40వేల కుటుంబాలకు సేవలందిస్తున్నది. అటువంటి పోర్టు హాస్పిటల్‌ను పిపిపి పద్ధతిలో ‘‘మల్టీ డిసిప్లైనరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్’’ గా 300 పడకలతో ప్రైవేటు వారికి కట్టబెట్టాలనే నిర్ణయాన్ని పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు.
పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చర్యలు తక్షణమే నిలుపుదలచేసి,…#vvwnews #visakapatnam
51