*పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 94 వ వార్డు, 95 వ వార్డులలో వివిధ గ్రామాల గ్రామ దేవతల పండుగ మహోత్సవాలలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు.*
ఈ రోజు అనగా *19.05.2026* తేదీన పెందుర్తి నియోజకవర్గం పరిధిలో జీవీఎంసీ 94 వ వార్డు మరియు 95 వ వార్డులలో పలు గ్రామాల్లో జరిగిన గ్రామ దేవతల పండుగ మహోత్సవాలలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. ముందుగా జీవీఎంసీ 95 వ వార్డు చీమలపల్లి శ్రీ రోళ్ళ పైడిమాంబ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ రోళ్ళ పైడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రమేష్ బాబు గారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఆ గ్రామ ప్రజలు ఎన్డీఏ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం జీవీఎంసీ 94 వ వార్డు బంటా కాలనీ గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి అమ్మవారిని మరియు జీవీఎంసీ 94 వ వార్డు కృష్ణరాయపురం సేనాతివానిపాలెం గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ రోళ్ల పైడిమాంబ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, పాడిపంటలు బాగా పండి అన్నదాతలు సంతోషంగా ఉండాలని, యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా కలగాలని అమ్మవార్లను ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ప్రార్థించారు.
ఈ యొక్క కార్యక్రమంలో 94 వార్డు మాజీ కార్పొరేటర్ బల్లా శ్రీనివాసరావు గారు, కనీస వేతనాలు డైరెక్టర్ బల్రెడ్డి అప్పారావు గారు,ఏఎంసీ డైరెక్టర్స్ లక్కీ గోవింద్ గారు,హైమావతి గారు, కోరుబిల్లి సంతోష్ గారు,సీనియర్ నాయకులు సానాతి దేవుడు గారు,దాట్ల మధు గారు, జగన్మోహన్ పాత్రుడు గారు, గంట్ల దివాకర్ గారు కంపర సత్తిబాబు గారు, నీటిపల్లి మహేష్ గారు, అయితే శ్రీనివాసరావు గారు,కోటి బోయిన శ్రీనివాసరావు గారు, ఎర్ర నాగరాజు గారు, చల్లా రావు గారు, ప్రజాశక్తి ఈశ్వరరావు గారు,మోటూరు చైతన్య గారు,జుత్తాడ శ్రీనివాసరావు గారు,తనకాల శ్రీనివాసరావు గారు, కోరుకొండ వరహాలు గారు, కోనా మోహన్ కుమార్ గారు, రాంబాబు గారు కర్రీ సంతోష్ గారు, చీరా రాజుగారు తదితరులు జీవీఎంసీ 94,95వ వార్డుల ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ దేవతల అమ్మవార్లను దర్శించుకున్నారు