ఫ్యాషన్ మరియు సంప్రదాయ దుస్తులు కోరుకునే వారి కోసం సూత్రా..#vvwnews #visakapatnam

by vvwnews.com

ఫ్యాషన్ మరియు సంప్రదాయ దుస్తులు కోరుకునే వారి కోసం సూత్రా భారతదేశం నలుమూలల నుండి తెచ్చిన వస్త్రాలతో ప్రదర్శన మరియు అమ్మకాలు నిర్వహిస్తున్నాది. సూత్ర ఎగ్జిబిషన్ వైజాగ్‌లోని నోవాటెల్‌ హోటల్ నందు అక్టోబర్ 8 & 9 తేదీలలో ప్రదర్శనను ప్రారంభించినట్లు ప్రకటించింది. దసరా & దీపావళి పండుగల కోసం ప్రత్యేక వస్త్రాలు అందించాలనే అంశం పైన ప్రత్యేక దృష్టి సారించినది. మహిళల దుస్తులు, సాంప్రదాయ దుస్తులు, ఫ్యూజన్ దుస్తులు, ఉపకరణాలు, నగలు, బ్యాగ్‌లు, గృహాలంకరణ, జీవనశైలి వస్తువులు మరియు గిఫ్ట్ అయిటంలు మొదలైన ఎన్నో రకాల ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంటాయి.
సూత్ర ప్రదర్శనలో దుస్తులు, గౌన్లు, చీరలు, పాదరక్షలు, ఉపకరణాలు తోపాటుగా డిజైనర్ ఉత్పత్తుల విస్తృత శ్రేణిని ప్రదర్శిస్తారు. మా అత్యంత ఆకర్షణీయమైన డిజైనర్ సేకరణలతో మీ జీవన శైలిని ఉన్నతంగా చేయడం మా లక్ష్యం అని నిర్వాహకులు చెపుతున్నారు. మా ఖాతాదారులు కోసం భారతీయత సమ్మిళితమైన అంతర్జాతీయ ఫ్యాషన్ వస్త్రాల రూప కల్పనకు తాము కృషి చేస్తున్నాము అన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles