తమిళనాడు రాష్ట్రం శ్రీపెరుంబుదూర్‌లో ఉన్న సామ్‌సంగ్ తయారీ యూనిట్‌లో పనిచేస్తున్న 1470 మంది కార్మికుల తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.నరసింగరావు డిమాండ్ చేసారు.
డైమెండ్ పార్కు వద్ద సామ్‌సంగ్ షాపు ముందు సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తమిళనాడు సామ్‌సంగ్ ఉద్యోగుల పోరాటానికి సంఫీుభావం కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో సి.హెచ్.నరసింగరావు పాల్గొని మాట్లాడుతూ దక్షిణకొరియాకు సంబంధించిన బహుళజాతి సంస్థ సామ్‌సంగ్. ఈ సంస్థ తమిళనాడు శ్రీపెరుంబుదూర్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌లో సుమారు 1800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా 1470మంది ఉద్యోగులు యూనియన్ పెట్టుకొని వారి డిమాండ్స్ కూడిన మెమోరాండం యాజమాన్యానికి ఇస్తే యూనియన్ పెట్టుకొనే హక్కు లేదని, యూనియన్‌పెడితే తొలగిస్తామని బెదిరించడం దుర్మార్గమన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో కార్మికులకు యూనియన్ పెట్టుకొనే హక్కు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.సుబ్బారావు, పి.వెంకటరెడ్డి, కె.ఎం.కుమార్‌మంగళం, లోకేష్, వెంకటరావు, వి.నరేంద్రకుమార్, జి.ఎన్.చలపతి, సూరీడు తదితరులు పాల్గొన్నారు.
సామ్‌సంగ్ తయారీ యూనిట్‌లో పనిచేస్తున్న 1470 మంది కార్మికుల తమ న్యాయమైన డిమాండ్లను..#vvwnews
50