*మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట.*
*పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.*
*గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ SERP ఆధ్వర్యంలో గ్రామ సంఘ సహాయకులు డ్వాక్రా వి వో ఏ లకు 20 లక్షల విలువైన సెల్ ఫోన్ లను పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు.*
ఈ రోజు అనగా *18. 4 .2026* తేదీన పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో పెందుర్తి నియోజకవర్గంకు సంబంధించిన 136 మంది వి వో ఏ లకు ప్రభుత్వం సమకూర్చిన సెల్ ఫోన్లను పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోను, వార్డు పరిధిలోని వివోఏలు సంబంధిత డ్వాక్రా సంఘాల రికార్డులు నమోదు, పరిశీలన, స్త్రీ నిధి ఖాతాల నివేదిక తయారీ, అలాగే డ్వాక్రా సంఘాల అప్పులు, తిరిగి చెల్లింపులపై నివేదికలు తయారీ తదితర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 వేల రూపాయల విలువైన సెల్ ఫోన్ లను వి వో ఏ లకు అందిస్తోందని తెలిపారు.
ఒక పెందుర్తి నియోజకవర్గంలోనే ఈ దఫా 136 మందికి 20 లక్షల 40 వేల విలువ గల సెల్ఫోన్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 28,500 మందికి 42 కోట్ల 75 లక్షల రూపాయలు విలువ గల సెల్ ఫోన్లు ప్రభుత్వం అందిస్తోందన్నారు.
గతంలోనూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మహిళల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు అమలు చేశారని అవి నేడు ఎంతో ఫలితాన్ని ఇస్తున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం మహిళల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతిస్తూ మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రమేష్ బాబు తెలిపారు. వి వో ఏ లు బాధ్యతాయుతంగా వ్యవహరించి డ్వాక్రా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు ప్రభుత్వ పరంగా అవసరమైన సాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు తెలియజేశారు
ఈ యొక్క కార్యక్రమంలో డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడి లక్ష్మీపతి గారు, పెందుర్తి మండలం ఎంపీడీవో అప్పల రాజుగారు, పరవాడ మండలం ఎంపీడీవో రమేష్ నాయుడు గారు, పెందుర్తి ఏపీఎం పద్మావతి గారు, సబ్బవరం ఏపీఎం శ్రీనివాస్ గారు, పరవాడ మండలం ఏపీఎం రంగారావు గారు, పెందుర్తి మండలం ఎంపీపీ శ్రీమతి శ్రీ మాలతీ నగేష్ గారు, ఎంపీటీసీలు గొల్లవిల్లి రమణ గారు, గండి హిమబిందు నాగభూషణం గారు, సీనియర్ నాయకులు హరగోపాల్ గారు, డిబిఎల్ సంతోష్ గారు తదితర పెందుర్తి నియోజకవర్గం డ్వాక్రా వివో ఏలు సీసీలు మరియు నియోజకవర్గ ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు