ప్రకృతి కార్యాలు ద్వారా విజ్ఞానం అవసరం
– విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచుదాం
– పశుపక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉంచుదాం
– ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలి
-జె.వి. రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
ప్రకృతి కార్యాశాల ద్వారా విజ్ఞానం పెంచుకోవడం అవసరం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. శనివారం ఉదయం మల్కాపురం లోని సెయింట్ ఆన్స్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో కరస్పాండెంట్ సిస్టర్ ఏనిమేటర్ గెసిల్ల అధ్యక్షతన 400 మంది ఎన్ సిసి విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులతో విత్తనాల బంతులు, ధాన్యం కంకులు కుచ్చులు తయారు చేసి, పశుపక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉంచి, మొక్కలు నాటిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం అడవుల్లో, కొండలలో పర్యటించి అక్కడి వాతావరణం, జీవవైవిధ్యాన్ని పరిశీలించి పరిరక్షించాలని కోరారు. విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచుదాం అన్నారు. మనం పీల్చే గాలిలొ రెండు శ్వాసల్లొ ఆక్సిజన్ లేకుంటె మృత్యువాత పెడతామని వివరించారు. పశుపక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉంచుదాం అన్నారు. ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలి అని కోరారు.
వనమాలి, సిటిజి ప్రతినిధి మళ్ళ సరిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మిద్దె తోటలు పెంచాలని కోరారు. తద్వారా ఆరోగ్య కరమైన కూరగాయలు ఆకుకూరలు పండ్లు పండించడం అవసరం అని వివరించారు. మిద్దె తోటలు ఉన్న ఇంటి వద్ద రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది అని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏనిమేటర్ సిస్టర్ ఎల్సి
డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ సిస్టర్ ప్రేమ కుమారి
ఇంటర్ కాలేజీ ప్రిన్సిపల్ సిస్టర్ కేసలిన్ జూలియట్,
హిందీ అధ్యాపకురాలు ఏ.ఆదిలక్ష్మి, తెలుగు అధ్యాపకురాలు పి. శివరంజని, వనమాలి సిటిజి ప్రాంతీయ ప్రతినిధులు కవిత, భారతి, దేవిక, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ సమన్వయకర్త లు రాజేశ్వరి, రవితేజ తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి కార్యాలు ద్వారా విజ్ఞానం అవసరం #vvwnews
4
previous post