భూమి దినోత్సవం జయప్రదం చేయండి #vvwnews #latestnews

by vvwnews.com

భూమి దినోత్సవం జయప్రదం చేయండి
– సమస్త జీవరాశినీ జివించేందుకు కృషి చేయాలి
– 27 మొక్కలు ప్రతి ఒక్కరూ నాటి పెంచాలి
– ప్రకృతి వనరుల పరిరక్షణ మన బాధ్యత
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
భూమి దినోత్సవం జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. మంగళవారం ఉదయం మద్దిలపాలెం లో ఉన్న అక్షర ఇంగ్లీష్ మీడియం విద్యాసంస్థ లో ప్రిన్సిపాల్ సునీత అధ్యక్షతన నిర్వహించిన భూమి దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం ఇతివృత్తం “మన శక్తి, మన గ్రహం,” అన్నారు. ఇది పర్యావరణ పురోగతి కేవలం ప్రభుత్వాల పరిపాలనల ద్వారానే కాకుండా, వ్యక్తుల రోజువారీ చర్యలు, ఆవిష్కరణలు సామాజిక భాగస్వామ్యం ద్వారా కూడా సాధ్యమవుతుందని నొక్కి చెప్పారు. ఇది పునరుత్పాదక శక్తికి మారడం, స్థానిక చర్యలు తీసుకోవడంపై ఉద్ఘాటిస్తుందన్నారు.
సమాజ స్థితిస్థాపకత, స్వచ్ఛ ఇంధన వాదన, మన భూగ్రహాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భాద్యతగా గుర్తెరిగి నడుచుకోవాలి అన్నారు. మన ఇల్లు, మన పని ప్రదేశం, పాఠశాలల్లో తీసుకునే రోజువారీ పర్యావరణ పరిరక్షణ నిర్ణయాలు అన్నీ కలిసి ఒక సుస్థిర భవిష్యత్తును రూపొందిస్తాయని వివరించారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సౌర, పవన శక్తి వంటి పునరుత్పాదక వనరుల వైపు మరల వలసి ఉందన్నారు. సమస్త జీవరాశినీ జివించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని కోరారు. స్కంద పురాణంలో లేదు వైస్ మహర్షి చెప్పిన విధంగా 27 మొక్కలు ప్రతి ఒక్కరూ నాటి పెంచాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వనరుల పరిరక్షణ మన బాధ్యత అని గుర్తెరిగి వాటిని కాపాడుకోవాలి అని వివరించారు.
ప్రిన్సిపాల్ సునీత మాట్లాడుతూ పర్యావరణ సమస్యలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో, అమెరికా లోని సెనేటర్ గేలార్డ్ నెల్సన్ కార్యకర్త డెనిస్ హేస్‌ను సమన్వయకర్తగా నియమించడంతో, మొదటి భూమి దినోత్సవం 1970 ఏప్రిల్ 22న జరిగిందన్నారు. 1990లో, ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, 141 దేశాలలో 20 కోట్ల మంది ప్రజలను స్పందించింది అని వివరించారు. ప్రస్తుతం 190 కి పైగా దేశాల్లో భూమి దినోత్సవం నిర్వహిస్తున్నారని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ సమన్వయకర్త ఐ కృష్ణ కుమారి, అధ్యాపకురాలు రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles