ప్రెస్ నోట్ కార్మిక వర్గ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడండి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి పిలుపు ఏప్రిల్ 26 నుండి 29 వరకు తిరుపతిలో జరుగు ఏఐటియుసి 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ తేదీ 21 -4- 2026 ఉదయం 10:30 కి అక్కయ్యపాలెం దుర్గా గణేష్ ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్స్ చిల్లర వర్తకులు సదస్సు జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామన మూర్తి పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు 26 నుండి 29 వరకు తిరుపతిలో జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 39 కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి కార్మికుల పై పని భారం పెంచడం దుర్మార్గం అన్నారు కేంద్ర ప్రభుత్వం చేసిన నాలుగు లేబర్ కోట్లు వెంటనే రద్దుచేసి 39 చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకు వాహన మిత్ర వెంటనే విడుదల చేయాలని వ్యానులు జీపులు కార్లకు గ్రీన్ టాక్స్ లేబర్ టాక్స్ రద్దు చేయాలని డీజిల్ పెట్రోల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ టోల్ పంజా ఫీజులు 30 శాతానికి తగ్గించి డ్రైవర్లకు జీవించే హక్కు కల్పించాలని కోరారు చిల్లర వర్తకలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన 2014 వీధి విక్రాయిదారుల చట్టాన్ని విశాఖలో వెంటనే అమలు చేసి ఫోటో గుర్తింపు కార్డులు హ్యాకర్ జోన్లు కట్టించాలని హామీలేని ముద్రణాలోనూ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆటో అండ్ మోటార్ కార్మికులు చిల్లర వర్తకులకు పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని విశాఖ స్టీలు ప్లాంట్ మరియు ప్రభుత్వరంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని విద్యా వైద్యం పేదలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమ పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో రావి కృష్ణ కే శివ యు శివాజీ వై వెంకట్ బాలు ఈశ్వర్ జి శ్రీను టి సాయికుమార్ సంతోష్ నూకరాజు తదితరులు పాల్గొన్నారు ఇట్లు కేలం శివ విశాఖ జిల్లా ఎఐటియుసి నాయకులు
కార్మిక వర్గ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడండి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి పిలుపు
0