విశాఖపన్వం, ఏప్రిల్ 20, 2026:
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం – 2026 అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
నిరంతర దర్శనాలు: తెల్లవారుజామున 3 గంటల నుండి క్యూ లైన్లు ప్రారంభమయ్యాయి. ఎక్కడా ఎటువంటి అంతరాయం కలగకుండా భక్తులకు స్వామి వారి నిజరూప దర్శనం కల్పించడం జరిగింది.
ఈ ఏడాది సుమారు 1.5 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ప్రాథమిక అంచనా.
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో షేడ్స్, మంచినీరు, మజ్జిగ మరియు బిస్కెట్ల పంపిణీ నిరంతరాయంగా సాగింది. ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, దేవస్థానం సిబ్బంది మరియు వందలాది మంది వాలంటీర్ల సమిష్టి కృషితో ఉత్సవం దిగ్విజయమైంది. ముఖ్యంగా మంత్రుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సూచనలు అందించారు.
క్రమశిక్షణ: భక్తులు కూడా నిబంధనలకు కట్టుబడి, మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా సహకరించడం వల్ల దర్శన ప్రక్రియ వేగంగా సాగింది.
మరికొద్ది గంటల్లో సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు. క్యూ లైన్లలో ఉన్న చివరి భక్తుడి వరకు దర్శనం కల్పించిన తర్వాతే ఉత్సవ ప్రక్రియ పూర్తి చేయబడుతుంది.
ఈ అనుభవాలను డాక్యుమెంట్ చేసి, వచ్చే ఏడాది మరింత మెరుగైన సౌకర్యాలతో, 2 లక్షల మంది వచ్చినా ఇబ్బంది కలగకుండా ప్రణాళికలు రూపొందిస్తామని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. సహకరించిన భక్తులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.