శ్రీశ్రీశ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న దక్షిణ నియోజకవర్గం ! #vvwnews

by vvwnews.com

*శ్రీశ్రీశ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు*

*వైభవంగా అమ్మవారి జాతర వేడుక*

ఈరోజు శ్రీ శ్రీ శ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారిని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ,పద్మజ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారి గర్భాలయంలో ఆలయ అర్చకులు పసుపు, కుంకుమతో ఎమ్మెల్యే దంపతులతో ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో శ్రీమతి గాయత్రి రాజ్ గోపాల్ గారు అమ్మవారి చిత్ర పటాన్ని ,ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ప్రజలందరూ అమ్మవారి దయతో ఎటువంటి విపత్తులు, చెడు సంఘటనలు జరగకుండా ,ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ యంత్రాంగానికి, శుభాకాంక్షలు తెలిపారు.. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles