శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం.#vvwnews

by vvwnews.com

సింహాచలం, మే 27, 2026:
కలకత్తా హైకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ జే సేన్‌గుప్తా వారి సతీమణి,బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి సింహాచల శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కార్య నిర్వహణాధికారి జె వెంకట్రావు ఆదేశాల మేరకు
ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి పి. శ్రీనివాసరావు, పర్యవేక్షణ అధికారి కె. వెంకటేశ్వరరావులు గౌరవ న్యాయమూర్తికి ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ సేన్‌గుప్తా కుటుంబ సమేతంగా ఆలయంలోని అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం
స్వామివారిని దర్శించుకుని దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు గౌరవ న్యాయమూర్తిని శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి పవిత్ర ప్రసాదాలను జ్ఞాపికగా స్వామి వారి ఫోటో అందజేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles