మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ మరణం యావత్ కాంగ్రెస్ పార్టీ లోకానికి తీరని లోటని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అద్యక్షులు లక్కరాజు రామారావు అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం సందర్భంగా నేడు విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపఠానికి కాంగ్రెస్ నాయకులు పూలదండలు వేసి నివాలీలు అర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ 10 సంవత్సరాల ప్రదాని హోదా సమయంలో మన్మోహన్ సింగ్ చేసిన సంస్కరణలు, చట్టాలు నేటికీ చిరస్థాయిగా ప్రజాఉపయోగకరంగా ఉన్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, తమ వంటి యువనాయకత్వ ప్రోత్సాహికానికి ఆయన ఎల్లప్పుడు అండగా నిలిచేవారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అటువంటి నాయకుని అడుగుజాడల్లో నడిచి, ఆయన ఆశయ సాధనకు పాటుపడతామని చెప్పారు.ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు వెస్ట్ సమన్వయకర్త సూర్యనారాయణ గారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ పినమల, సరస్వతుల మణికంఠ గారు , సిటీ అధ్యక్షులు సతీష్ అల్లిపిల్లు గారు ,సిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కస్తూరి వెంకట్రావు గారు, మైనారిటీ సెల్ అర్షాద్ భాష గారు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం యావత్ కాంగ్రెస్ పార్టీ లోకానికి తీరనిలోటు..#vvwnews
42