రాష్ట్రంలోని మహిళలకు తెలుగుదేశం పార్టీ కాలకేయుల నుంచి రక్షణ కల్పించాలని వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. సిరిపురం లోని తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ ఇప్పుడు ‘తెలుగు దండుపాళ్యం పార్టీ’గా తయారైందన్న ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడా మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. గతంలో మాదిరిగా దిశ యాప్, దిశపోలీస్స్టేషన్లు వ్యవస్థ లేకపోవడం వల్లనే ఆ పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దుర్గాట జాన్ అనే టీడీపీ నాయకుడు 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసే ఘోరమైన దుస్థితికి పాలన దిగజారిందని వరుదు కళ్యాణి ఆక్షేపించారు. ఇంత జరిగినా ఆయన కనీసం స్పందించలేదని గుర్తు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం సొంత జిల్లాలు, హోం మంత్ర…
రాష్ట్రంలో ఎక్కడా మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా #vvwnews #latestnews #ysrcp
by vvwnews.com
written by vvwnews.com
54