బీసీ ల ఆత్మీయ కలయిక సభ “సామాన్యుడు శాసనం”

by vvwnews.com

బీసీలకు రాజకీయం కాదు రాజ్యాధికారం కావాలి
– రిటైర్డ్ ఐపిఎస్ ,డీజీపీ జే .పూర్ణచంద్రరావు
బీసీలకు ,బహుజనులకు కావాల్సింది రాజకీయం కాదని ,రాజ్యాధికారం కావాలని రిటైర్డ్ ఐపిఎస్ ,డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ , బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ జే.పూర్ణచంద్రరావు అన్నారు. విశాఖ ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో బీసీ ఆత్మీయ సభ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, రెండు కులాల పాలనలో ఆంధ్రప్రదేశ్ అడుగంటిందని, ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలి వేటని పేర్కొన్నారు. చైతన్యవంతులు, మేధావులు, కుల సంఘాల పెద్దలు చైతన్య వంతులై రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బి .పరంజ్యోతి మాట్లాడుతూ ,రానున్నది బహుజనవాదమని, బహుజనులే ప్రజాస్వామ్య పరిరక్షకులని, అందుకు ముఖ్యంగా బీసీలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే, బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ లకే రాజారావు మాట్లాడుతూ, రాజకీయాలను నోట్లు కాకుండా ఓట్లు శాసించే సామాజిక పరిణామాలు బీసీ, బహుజనులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతిరావు, రాష్ట్ర కార్యదర్శి కదిరి రాము, పెదపెంకి శివ ప్రసాద్ రావు ,బహుజన సమాజ్ పార్టీ నాయకులు పీరుబండి ప్రకాశరావు, సోము రాంబాబు, ఎం చిన్నారావు, సిహెచ్ .ప్రభాకర్ రావు, బోని కృష్ణ, కొమ్ము సోములు, బోకర నారాయణరావు తో పాటు బహుజన సంఘాల నాయకులు తెప్పల శాంతరామ్, ప్రొ. ఎస్ సూరప్ప, కుప్పిలి మురళీధర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాల నాయకులు, బహుజన వాదులు, ఫూలేయులు,అంబేద్కరీయులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles