జనసేన నాయకులు మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేయడం సరికాదు అన్నారు

by vvwnews.com

వచ్చే ఎన్నికల్లో కాపులు వైసీపీకి బుద్ధి చెబుతారు..

-జనసేన జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు….

విశాఖపట్నం :

రానున్న ఎన్నికల్లో కాపులు వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని జనసేన జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు చెప్పారు. నగరంలోని హోటల్ మేఘాలయలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ , జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి కులం వారితో పవన్ కళ్యాణ్ ని తిట్టిస్తున్నారని, ఇప్పుడు కాపు కమ్యూనిటీతో ఆ పని చేయిస్తున్నారని, కాపు జాతికి విరేమి న్యాయం చేశారని ప్రశ్నించారు. కాపులను చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెట్టారని అవాకులు చివాకులు మాట్లాడుతున్నారన్నారు. నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే, కాపు జాతిని తిట్టవచ్చా అని ప్రశ్నించారు. పవన్ అధికారంలోకి వచ్చి ఏమైనా చేయకపోతే ప్రశ్నించవచ్చు అన్నారు. జగన్ వేసిన ఎంగిలి మెతుకుల కోసం మాట్లాడటం లేదా అని అడిగారు. ఆయా కులాల్లో ఎవరిని ఎదగనివ్వరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు సినిమాల ద్వారా కోట్ల రూపాయల వస్తుందని, ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. హరి రామ జోగయ్య తనయుడు సూర్య ప్రకాష్, ఏ ప్యాకేజీ కోసం వైసీపీలోకి చేరాడో అన్నారు. సూర్య ప్రకాష్ కూడా పవన్ కళ్యాణ్ తిడుతున్నారంటే, కొడుకును కంట్రోల్ చేయలేవా అని హరీ రామ జోగయ్యని ప్రశ్నించారు. రంగా హత్య కేసులోని ప్రధాన నిందితుడు వైసిపిలో ఉంటే మాట్లాడరా అని అడిగారు. వైసీపీ మంత్రులను ఎమ్మెల్యేలను జాతులు, కులాలు క్షమించవన్నారు. తప్పనిసరి పరిస్థితిలో కులం కోసం మాట్లాడాల్సి వచ్చిందన్నారు. పిఠాపురం కాలనీ రోడ్డులోని తోపుడుబండ్ల తొలగింపుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కాసేపు తడబడ్డారు. తర్వాత మాట్లాడుతూ, వేరే దగ్గర మార్కెట్ ప్లేస్ కట్టించామని అక్కడికి వెళ్ళిపోమని చెప్పామని మూర్తి యాదవ్ బదులిచ్చారు. అనేక చోట్ల రోడ్ల పక్కన ఉన్న చిరు వ్యాపారాలను తొలగించారని, తాను అలాగే చేస్తున్నానని బదులిచ్చారు. ఇదిలా ఉండగా అవన్నీ అధికార పార్టీకి చెందినవారు తమ స్వలాభం కోసం ఆయా ప్రాంతాల్లో తొలగించి ఉండవచ్చని, ప్రతిపక్షంలో ఉన్నవారు చిరువ్యాపారుల వైపు ఉండి ఆదుకోవాలని, అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని ఓ విలేఖరి మూర్తిని నిలదీశారు . సమావేశంలో జనసేన చోడ వరం నాయకుడు పి వి ఎస్ ఎన్ రాజు కూడా పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles