విశాఖ….
బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్ లో బుద్ధి చెప్పండి …మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
అసెంబ్లీ, పార్లమెంట్ లలో కొంతమంది అపహస్య పనులు చేస్తున్నారు…వాటిని చూడకుండా ప్రశాంతంగా ఉండాలి….
రాజకీయ నాయకులు స్థాయి మరచి చౌకబారు మాటలు మాట్లాడకూడదు.
ఈ మధ్య కాలం లో రాజకీయ నాయకులు భూతులు మాట్లాడుతున్నారు…ఇటువంటి వారికి పోలింగ్ బూత్ లో సమాధానం చెప్పాలి.
చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యం…
మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదు…
మాతృభాష కళ్ళు లాంటిది… పరాయి భాష కళ్లద్దాలు
విలువలతో కూడిన విద్య ఉంటే విలువలతో కూడిన పౌరునిగా తయారవుతారు.
నేడు విలువలతో కూడిన విద్య తగ్గుతుంది..ఇది మంచిది కాదు.
విలువలతో కూడిన విద్య ను అందించడానికి అందరూ కృషి చేయాలి.
దేశంలో ఉన్న మేధాశక్తి వలన మరల ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తోంది.
భగవంతుడు ఎం కలవాలని అడిగితే మళ్ళీ విద్యార్థి దశకు తీసుకువెళ్లాలని కోరుకుంటాను.
దేశ వారసత్వాన్ని కాపాడుకోవాలి.
గూగుల్ గురువుని మించింది కాదు.