చేనేత హస్తకళలను ప్రోత్సహించాలి:-ఎమ్మెల్యే పల్లా* #vvwnews

by vvwnews.com

*

గాజువాక:-చేనేత హస్తకళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.గాజువాక వంటిల్లు కూడలిలో ఇన్షాఅల్లా సోషల్ వర్కర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆలిండియా క్రాఫ్ట్ బజార్ ను సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులందరినీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చి హస్త కళలను ప్రోత్సహించడం అభినందనీయం అన్నారు.ఇటువంటి ప్రదర్శనల ద్వారా ఎంతో మందికి ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. అనంతరం చేనేత కళాకారులు తయారుచేసిన వస్త్రాలను పరిశీలించారు.ప్రదర్శనలో హైదరాబాద్ ముత్యాలు,కలంకారి పెయింటింగ్స్,సారాంపూర్ వుడ్ కార్వింగ్,ఏటికొప్పాక బొమ్మలు, బిట్స్ జ్యువలరీ,మైసూర్ రోజ్ వుడ్,పెరాకోట్ డోర్ కర్టెన్స్ వంటివి ఉంచారు.సొసైటీ కార్యదర్శి మహమ్మద్ సలీమ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్వార్,గోమాడవాసు,సింగూరు అనంత్,ఆఫీజ్,బుల్లెట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles