మాజీ కార్పొరేటర్ పూర్ణిమ వైసిపి సీనియర్ నేత కోడిగుడ్ల శ్రీధర్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుక

by vvwnews.com

*శ్రీధర్*

41 వ వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ వైసిపి సీనియర్ నేత కోడిగుడ్ల శ్రీధర్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. వార్డులో జరిగిన ఈ వేడుకలు అనేకమంది వైసీపీ నేతలు కార్యకర్తలు ఆ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ కార్పొరేటర్ గా పనిచేసిన కాలంలో 17 కోట్ల రూ.లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. అధికారంలో ఉన్న లేకపోయినా నిరంతరం 41 వ వార్డు ప్రజలకు తాను సేవలు అందిస్తూ ఉంటానని చెప్పారు. కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ ప్రతినెల రెండో శనివారం ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేస్తామన్నారు. జ్ఞానాపురాన్ని గ్రీన్ ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ఇంకా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు నా సాయి శక్తుల కృషి చేస్తారని శ్రీధర్ తెలియజేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles