*మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి కేంద్రం ప్రభుత్వం భారతరత్న ప్రధానం చేసిన నేపథ్యంలో విశాఖపట్నం చేరుకున్న వెంటనే ఈరోజు పివి నరసింహరావు గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి శ్రద్ధాంజలి ఘటించిన బిజెపి ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు*
*జీవీఎల్ కామెంట్స్:*
*పివి గారికి భారతరత్నం లభించడం ఒక తెలుగువారికే గాక దేశ ప్రజలందరికీ కూడా ఒక గౌరవం.
*ముఖ్యంగా తెలుగు వారికి ఇది గర్వకారణం
*దేశ ప్రధానిగా శ్రీ పీవీ నరసింహారావు గారు పాలనలో ఒక కొత్త ఆర్థిక శకానికి నాంది పలికారు.
*అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనతో ఆర్థికంగా క్లిష్ట పరిస్థితికి చేరుకున్న భారత దేశ ఆర్థిక వ్యవస్థను సరళికృత ఆర్థిక విధానాలతో గట్టెక్కించిన ఘనుడు శ్రీ పీవీ నరసింహారావు గారు
*శ్రీ పివి నరసింహరావు గారు బిజెపికి సంబంధించిన వ్యక్తికానప్పటికీ దేశానికి ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ భారతరత్న అవార్డును ప్రధానం చేయడం మా పార్టీ సంస్కృతికి, విధానాలకు అద్దం పడుతోంది.
*బిజెపి దేశ సేవ చేసినటువంటి వ్యక్తులను పార్టీలకు, కులాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా గుర్తిస్తుందనడానికి ఇది నిదర్శనం.
*కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2004 నుండి 2024 వరకు అధికారంలో ఉన్నప్పటికీ పివి గారు చేసిన సేవలను గుర్తించి వారికి సముచిత గౌరవం ఇవ్వలేదు.
*పీవీ గారిని మరణానంతరం కూడా ఘోరంగా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
*పివి నరసింహారావు గారి పార్థివ దేహాన్ని కూడా కాంగ్రెస్ ఆఫీసులోకి రానీయకుండా అవమానించిన ఘోర చరిత్ర సోనియా మరియు రాహుల్ గాంధీలది.
*కానీ రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేళ్లతో పాటు పీవీ నరసింహారావు గారిని కూడా వారి స్థాయికి తగ్గ సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవించారు.
*ఇది దేశ సేవ చేసిన వారి పట్ల ప్రధానికి గల గౌరవానికి నిదర్శనం.
*రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, శ్రీ పివి నరసింహారావు గారికి స్మారక చిహ్నం నిర్మించి, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించి, ఆయన పేరు మీద అవార్డులు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను.