2
అనకాపల్లి..
అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
గాయపడిన వారిలో ముల్లేటి కోటేశ్వరరావు, వాసు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారిని ఎన్టీఆర్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి, రైలు రాకపోకలకు అంతరాయం కలగకుండా అడ్డుగా పడిన ఐరన్ పిల్లర్లను తొలగించారు.
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.