సమిష్టి కృషితో విజయ శిఖరాలు …ఎన్.బి.ఎం న్యాయ కళాశాల డీన్ డా. డీ.వి. రమణ* #vvwnews

by vvwnews.com

*

*యాంకర్ వాయిస్*

విశాఖపట్నంలో ఎన్‌బీఎం న్యాయ కళాశాల మరోసారి ప్రతిభ చాటుకుంది.
ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో “ఉత్తమ అనుబంధ కళాశాల”గా ఎంపికై, మొత్తం ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని సీతమ్మధారలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘన కార్యక్రమం నిర్వహించారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ బి. గాయత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పూర్వ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులను సన్మానించారు.డీన్ డాక్టర్ డీ.వి. రమణకు ప్రత్యేక అవార్డు, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సత్యసాగర్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించాయి.
పూర్వ విద్యార్థి డాక్టర్ వై. ఉమాశంకర్, విద్యార్థిని హిమబిందు కూడా అవార్డులు అందుకున్నారు.
ఈ సందర్భంగా డీన్ డాక్టర్ డీ.వి. రమణ మాట్లాడుతూ… న్యాయ విద్యలో విలువలు, నైతికత అత్యంత ముఖ్యమని… సమాజానికి న్యాయం చేసే న్యాయవాదులను తయారు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఇప్పటి వరకు ఈ కళాశాల నుంచి 5000కు పైగా న్యాయవాదులు బయటకు వచ్చారని… పలువురు హైకోర్టు న్యాయమూర్తులుగా, న్యాయవేత్తలుగా కీలక స్థానాల్లో ఉన్నారని వెల్లడించారు.మరోవైపు, ప్రిన్సిపాల్ డాక్టర్ బి. గాయత్రి… ఈ విజయాన్ని మరింత బాధ్యతగా తీసుకుని భవిష్యత్తులో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో న్యాయవేత్తలు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు భారీగా పాల్గొని కళాశాల విజయాన్ని హర్షాతిరేకంతో అభినందించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles