కండ బలంతో సాక్షులను బెదిరించిన ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ రద్దు చెయండి* #vvwnews

by vvwnews.com

గాజువాక: ఏప్రిల్ 22
*కండ బలంతో సాక్షులను బెదిరించిన ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ రద్దు చెయండి*
*విదసం నేత డాక్టర్ బూసి…*
దళిత యువకుడు వీధి సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంత బాబు న్యాయ సౌకర్యాన్ని దుర్వినియోగం చేశాడని. కండ బలం చూపించి సాక్షులను బెదిరించినoదుకు సి ఆర్ పిసి 439 కింద తక్షణమే బెయిల్ రద్దు చేయాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు..
వీధి సుబ్రమణ్యం కేసులో ప్రధాన సాక్షులను బెదిరించిన నేపద్యంలో అనంత బాబు బెయిలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు గాజువాక లో విదసం నాయకులు నిరసన తెలిపారు.. ఈ సందర్భంగా వెంకట రావు మాట్లాడుతూ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో న్యాయాన్ని నిలబెట్టడానికి ధైర్యంగా ముందుకు వచ్చి నిజాయితీగా సాక్ష్యం చెప్పిన వారిని అనంత బాబు అనుచరులు వైసీపీ నాయకులు రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి కోర్టులో అనంత బాబు న్యాయవాది సూచన ప్రకారం తప్పుడు సాక్ష్యం చెప్పాలని వత్తిడి చేసి బలవంతంగా డబ్బు చేతిలో పెట్టీ మర్యాదగా డబ్బు తీసుకోండి లేకపోతే చంపేస్తామని బెదిరించడం అంటే అనంత బాబు నేరప్రవుర్తి లో ఏమి మార్పు రాలేదన్నారు. వీధి సుబ్రమణ్యం ను నేనే హత్య చేశానని నేరుగా ఎస్పీ ఎదుట నేరం అంగీకరించిన వాడికి 60 రోజులకే బెయిలు ఇచ్చేస్తే ఇక కోర్టులు , జైళ్లు అంటే భయమేముందని అందుకే రౌడీ మూకలను ఉపయోగించి సాక్షులను లొంగదీసుకునే స్థాయికి బరితెంగించాడని వెంకట రావు ఆగ్రహం వ్యక్తం చేసారు.. న్యాయాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చి పిర్యాదు చేసిన సాక్షులకు 2018 సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రాణ రక్షణ కల్పించాలని , సాక్షులను జడ్జి గారి చాంబర్లో రహస్య విచారణ మాత్రమే చేయాలని, వ్యక్తిగత ఉపాధికి రక్షణ కల్పించి సాక్షుల రక్షణ నిధి నుండి ఆర్థిక సహాయం అందించాలని డిమాండు చేసారు.. అనంత బాబు, అతని భార్య లక్ష్మీ దుర్గను, సాక్ష్యాలను బెదిరించిన సెటిల్ మెంట్ రౌడీ మూకలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.. బూల భాస్కర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మూర మహేశ్, యు ఎస్ రాజు, సన్యాసి రావు, శాపల దాలయ్య , గుడివాడ భాస్కర రావు, గురు దేవి, నిరీక్షణ రావు..

Use Social Media to Spread the Word about Our News

related articles