ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఆపరేటర్సు అసోసియేషన్ కు సంబంధం లేని వ్యక్తులు
అసోసియేషన్ పేరు చెప్పుకుని, కూటమి ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని
అసోసియేషన్
ప్రెసిడెంట్
మైలపల్లి లక్ష్మణ్ రావు
ప్రధాన కార్యదర్శి సూరపతి నరసింగరావు .
గురువారం
ఫిషింగ్ హార్బర్
అసోసియేషన్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
వాసుపల్లి జానకీ రామ్ అనే వ్యక్తికి తమ అసోసియేషన్ కు ఎటువంటి సంబంధం లేదన్నారు.
గతంలో ఈ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఓడిపోయారని చెప్పారు.
ఆ తర్వాత వేరేగా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడంతో.. ఆయనతో పాటు,అతని వెంట ఉన్న వారిని తమ సోసియేషన్ నుంచి తొలగించామని అన్నారు.
అయినప్పటికీ వాసుపల్లి
జానకీ రామ్ తమ అసోసియేషన్ కార్యాలయంలో తన మనుషులతో సమావేశం ఏర్పాటు చేసి తానే ఈ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ అని తనకు తానే ప్రకటించుకున్నారని ఆరోపించారు.
అంతటితో ఆగకుండా కూటమి ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.ఈ ప్రభుత్వం మాత్య్సకారుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు.
అతని పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఆపరేటర్సు అసోసియేషన్ కు సంబంధం లేని వ్యక్తులు
0