ఆందోళనకు గురి కాకుండా పరీక్షలకు సిద్ధం కావాలి
– టెన్త్ విద్యార్థులకు త్రీ టౌన్ ట్రాఫిక్ సీఐ అమ్మినాయుడు సూచన
విశాఖపట్నం :కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవలో భాగంగా ముందుకు రావడం ఎంతైనా అవసరం ఉందని.. మూడో పట్టణ ట్రాఫిక్ సిఐ అమ్మినాయుడు అన్నారు. వాల్తేర్ సమీపంలోని శాంతి ఆశ్రమంలో టీవీఎస్ అపాచీ – హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అమ్మి నాయుడు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో 10వ తరగతి పరీక్షలు ఒక కీలకమైన మలుపుగా అభివర్ణించారు. అయితే ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు కట్టా మల్లేశ్వరరావు, మంజుల,
టీవీఎస్ టెరిటరీ మేనేజర్ రవికిరణ్, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.