కరాటేలో సతీష్ కుమార్ 7వ డాన్ బెల్ట్ సాదించారు – #vvwnews

by vvwnews.com

కరాటేలో సతీష్ కుమార్ 7వ డాన్ బెల్ట్ సాదించారు – అభినందనలు తెలిపిన సినీ హీరో సుమన్, బాజపా రాష్ట్ర నేత కేఎన్ఆర్

హెచ్.బి కోలనీ డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో వొడాకాయ్ కరాటే డు అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరో, మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ సుమన్ తల్వార్, విశిష్ట అతిథిగా బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు. కరాటేలో 7వ డాన్ బ్లాక్ బెల్ట్ సాదించిన సిహెచ్ సతీష్ కుమార్ కి సర్టిఫికెట్ అందజేసి సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ఆత్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని సూచించారు. గత ముప్పై సంవత్సరాలుగా సతీష్ కుమార్ కరాటే కోసం చేస్తున్న సేవలను కొనియాడారు. పలుమార్లు రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారని తెలిపారు. నరసింగరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేలో ఇండియా పథకం ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం మార్చి నెలలో జరగనున్న రాష్ట్ర స్థాయి కరాటే పోటీల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ, బాజపా నేత బొత్స సురేష్, ఏక్సిస్ బ్యాంకు ఉద్యోగి ఉషారాణి, అనిల్, సీనియర్ కోచ్లు గంటా నూకరాజు, కిషోర్, అగస్త్య, కరణం సన్నీ, రాము, గోవర్ధన్, అంబు, ఆనంద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles