తాటిచెట్లపాలెం విశ్వతేజ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలుగుతనం ఉట్టి పడేలా విద్యార్థులను సాంప్రదాయ దుస్తులతో అలంకరించిన తల్లిదండ్రులు వారికి భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. భోగి మంటలు, ముగ్గుల పోటీలు వేసి సంక్రాంతి జరుపుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ భాస్కరరావు, ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ.. మన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా, చిన్నారులకు పండగ విశిష్టతను తెలియజేయడం చాల సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. సంక్రాంతి పండుగ అనేది ఆధ్యాత్మికత, కుటుంబం, సంస్కృతిని కలిపే గొప్ప పండగన్నారు. పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో రైతులకు ఇది ఆనందాన్ని, సంపాదనను తెస్తుందని అందుకే దీన్ని పంటల పండుగ అంటారన్నారు. ఉమ్మడి కుటుంబాల స్ఫూర్తిని, ఆత్మీయతను పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తాటిచెట్లపాలెం విశ్వతేజ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు #vvwnews
6