7..కనకారెడ్డి
రాష్ట్ర ప్రజల్లో కూటమి ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. జగన్ పరిపాలనను రాష్ట్ర ప్రజల కోరుకుంటున్నారన్నారు. 35 వార్డ్ వైసిపి అధ్యక్షులు అలుపన కనకారెడ్డి ఆధ్వర్యంలో వార్డులో జరిగిన కార్యక్రమంలో 35 వార్డు కల్లుపాకలకు చెందిన టిడిపి నాయకులు దేవర రత్నం, రాజు సారద్యం లో వందమంది కుటుంబ సభ్యులు వైసిపి లో జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు ముందుగా వాసుపల్లి గణేష్ కుమార్ వైసిపి కండువా వంద కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ జగన్ పాలనలోనే రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం జరిగిందన్నారు. ప్రజలతో పాటు ఈసారి పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. 35 వార్డు వైసిపి అధ్యక్షులు ఏ కనకారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ పాలనను స్వర్ణయుగంగా అభివర్ణించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పాలన అత్యంత దారుణంగా ఉందని కనకారెడ్డి మండిపడ్డారు.