ఆరామ ద్రావిడ సంఘం కేంద్ర కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక #vvwnews

by vvwnews.com

ఆరామ ద్రావిడ సంఘం కేంద్ర కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షులుగా : బ్రహ్మశ్రీ వేమకోటి సూర్యనారాయణ
కేంద్ర కమిటీ అధ్యక్షులుగా: ఇప్పిలి శంకర్ శర్మ ,ప్రధాన కార్యదర్శి జోష్యుల శివప్రసాద్

విశాఖపట్నం మధురవాడ దుర్గా కన్వెన్షన్ లో మంగళవారం
శ్రీ ఆరామ ద్రావిడ సంఘం కేంద్ర కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అధ్యక్షులుగా శ్రీకాకుళం సూర్యనారాయణ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ప్రధాన కార్యదర్శిగా జోష్యుల శివప్రసాద్ శర్మ ఎన్నికయ్యారు. మంగళవారం మధురవాడలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా తెలంగాణ శాఖల కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం గౌరవాధ్యక్షులు బ్రహ్మశ్రీ వేమకోటి సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో సంఘానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు కొత్త కార్యవర్గాల ఏర్పాటు చేపట్టారు. ఉపాధ్యక్షులుగా అనకాపల్లికి చెందిన బంకుపల్లి సూర్యనారాయణ శర్మ, ఉప కార్యదర్శిగా చాపరకు చెందిన వనమాలి వెంకటరమణ శర్మ, కోశాధికారిగా శ్రీకాకుళానికి చెందిన ధర్మపురి గౌరీ శంకర్ శాస్త్రి, ఉప కోశాధికారిగా పాలకొండ కు చెందిన దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ ఎన్నికయ్యారు.
విశాఖ జిల్లా అధ్యక్షులుగా వేమకోటి సుబ్బలక్ష్మి నరసింహ శర్మ, కార్యదర్శిగా రేజేటి గురునాధరావు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా తెలంగాణ శాఖల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles