పక్షులను కాపాడుకుందాం ప్లాస్టిక్ కాలుష్యాన్ని తరిమికొడదాం #vvwnews

by vvwnews.com

పక్షులను కాపాడుకుందాం ప్లాస్టిక్ కాలుష్యాన్ని తరిమికొడదాం
– ఒక్క సారి వాడి పడెసె ప్లాస్టిక్ వద్దే వద్దు.
-పక్షి సంరక్షణ కేంద్రాలు అధికంగా ఏర్పాటు చేయాలి.
– రావిరాల శృతి శ్రీ, జిల్లా సమన్వయకర్త, స్వచ్చాంధ్ర కార్పొరేషన్
పక్షులను కాపాడుకుందాం ప్లాస్టిక్ కాలుష్యాన్ని తరిమి కొడదాం అని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ విశాఖపట్నం జిల్లా ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ విభాగం సమన్వయకర్త రావిరాల శృతి పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఎంవిపి కాలనీలోని ఆళ్వార్ దాస్ డిగ్రీ కళాశాల లో ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ అధ్యక్షతన పక్షుల దినోత్సవం సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి ప్రేమికులు, పక్షి ప్రేమికులు, పక్షి వీక్షకులు ప్రతి సంవత్సరం జనవరి 5న పక్షుల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తు పక్షుల వల్ల కలిగే లాభాలు వివరించాలన్నారు. అలాగే మప పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని కోరారు. ఒక్క సారి వాడి పడెసె ప్లాస్టిక్ వాడవద్దని పిలుపునిచ్చారు.
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ పక్షుల రక్షణ, వాటి మనుగడకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కలుపు తీత, గడ్డి నివారణ కోసం వినియోగిస్తున్న రసాయన మందులు పక్షుల జీవనానికి మరణ శాసనంగా తయారయ్యాయి అని వివరించారు. ఈ రసాయన మందులు నివారించక పోతే భవిష్యత్తులో పక్షి జాతులు అంతరించి పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇప్పటికే పూరేడు పిట్టలు కనబడటం లేదని, కత్తెర పిట్టలు, బంగారు పిచ్చుకలు బీ ఈటర్స్, చెమర కాకి అంతరించిపోయే ప్రమాదంలో
ఉన్నాయన్నారు. ప్రపంచంలోని దాదాపు 10,000 పక్షి జాతుల్లో చాలా జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని వివరించారు. అంతరించిపోతున్న పక్షుల రక్షణ కోసం పక్షి సంరక్షణ కేంద్రాలను అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ పక్షి అభిమానులు ఈ రోజును అనేక కార్యక్రమాలతో ఘనంగా జరుపుకుంటారని వివరించారు. ప్రధానంగా
పక్షి వీక్షణ, పక్షులపై అధ్యయనం, ఇతరులకు అవగాహన కల్పించడం అవసరం అని చెప్పారు.
ప్రతి ఒక్కరూ పక్షి ప్రేమికులుగా మారాలని కోరారు. ప్రతి విద్యార్థి తమ వంతు బాధ్యతగా పక్షులకు ఆహారాన్ని, నీటినీ అందుబాటులో ఉంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles