*అనకాపల్లి జిల్లా పోలీసు*
*పత్రికా ప్రకటన*
*అనకాపల్లి జిల్లాలో ఘనంగా ముగిసిన ‘అభ్యుదయం’ సైకిల్ ర్యాలీ – డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా 52 రోజుల సుదీర్ఘ ప్రయాణం.*
*అనకాపల్లి, జనవరి 03:* మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టి, యువతలో చైతన్యం నింపడమే లక్ష్యంగా విశాఖపట్నం రేంజ్ ఐజీపీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ గారి ఆలోచనలతో, అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి పర్యవేక్షణలో చేపట్టిన *ప్రతిష్టాత్మక ‘అభ్యుదయం’ సైకిల్ ర్యాలీ నేడు అత్యంత ఉత్సాహ భరిత వాతావరణంలో ముగిసింది.*
జిల్లా వ్యాప్తంగా 3 కి.మీ. వాకథాన్
ముగింపు వేడుకల సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని మూడు సబ్ డివిజన్లలో శనివారం ఉదయం 3 కిలోమీటర్ల వాకథాన్/రన్ నిర్వహించారు:
*అనకాపల్లి సబ్ డివిజన్:* డీఎస్పీ శ్రీమతి ఎం.శ్రావణి, సీఐ/ఎస్.హెచ్.ఓ ల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం నుండి పెరుగు బజార్ వరకు వాకథాన్ నిర్వహించి, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.
*నర్సీపట్నం సబ్ డివిజన్:* డీఎస్పీ శ్రీ పి.శ్రీనివాసరావు, సీఐ/ఎస్.హెచ్.ఓ ల ఆధ్వర్యంలో జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ శ్రీమతి డి.భరణ శ్రీ జండా ఊపి వాకథాన్ ప్రారంభించారు. అభిద్ సెంటర్ నుండి బొడ్డేపల్లి వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.
*పరవాడ సబ్ డివిజన్:* డీఎస్పీ శ్రీ వి.విష్ణు స్వరూప్ మరియు ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, సీఐ/ఎస్.హెచ్.ఓ ల ఆధ్వర్యంలో అచ్యుతాపురం పార్క్ రోడ్, నాగవరం జంక్షన్ పరిసరాల్లో రన్ నిర్వహించి, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.
గత ఏడాది నవంబర్ 12న పాయకరావుపేటలో గౌరవ హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ యాత్ర, దాదాపు 52 రోజుల పాటు ఐదు జిల్లాల్లో (అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం) సాగి సుమారు 1,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
*అనకాపల్లి జిల్లాలో* 179 కిలోమీటర్ల మేర ప్రయాణించి 95 గ్రామాలు, వందలాది పాఠశాలలు, కళాశాలలను సందర్శించింది.
ఈ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా సుమారు 44,000 మంది పాల్గొన్నారు. ఇందులో 18,000 మంది విద్యార్థులు మరియు 26,000 మంది సాధారణ ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఉండటం విశేషం.
సుమారు 42,000 పోస్టర్లు, కరపత్రాల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు.
ఈ మహత్తర కార్యక్రామానికి స్థానిక ఎమ్మెల్యేలు శ్రీ కె.ఎస్.ఎన్.రాజు (చోడవరం), శ్రీ కొనతాల రామకృష్ణ (అనకాపల్లి), శ్రీ సుందరపు విజయ్ కుమార్ (యలమంచిలి), ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ గారు పూర్తి సహకారాన్ని అందించారు.
కేవలం ర్యాలీకే పరిమితం కాకుండా, విద్యార్థుల కోసం “గంజాయి మరియు ఇతర డ్రగ్స్ ప్రభావం – నివారణలో యువత పాత్ర” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. 16 ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభల ద్వారా ఎన్.డి.పి.ఎస్ (NDPS) చట్టంపై అవగాహన కల్పించారు.
”డ్రగ్స్ కు వద్దు – జీవితానికి ముద్దు” (Say No to Drugs – Life is Precious) అనే నినాదంతో సాగిన ఈ అభ్యుదయం సైకిల్ ర్యాలీ, అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం మరియు ప్రజల సమష్టి కృషితో ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచింది.
*జిల్లా పోలీస్ కార్యాలయం,* *అనకాపల్లి.*