12
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గిరిజనులకు చీరలు, బట్టల, స్వీట్లు పంపిణీ చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని స్వచ్ఛంద సేవ సంస్థ శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ ప్రముఖ సంఘ సేవకురాలు డా.కుప్పిలి కీర్తిపట్నాయక్ అన్నారు. పీఎం పాలెం, సంభవాని పాలెంలో అంగన్వాడి స్కూల్లో గిరిజనులకు సంక్రాంతి కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత 22 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 60 మంది వృద్ద గిరిజన మహిళలకు పీఎం పాలెం ఎస్ఐ శ్రావణి చేతులు మీదుగా అందజేశామన్నారు.