*పోర్టు స్టేడియంలో వాకర్స్ కు* *అవయవ దానం పై అవగాహన సదస్సు*

by vvwnews.com

*పోర్టు స్టేడియంలో వాకర్స్ కు*
*అవయవ దానం పై అవగాహన సదస్సు*

అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో వాకర్స్ కు సోమవారం అవయవ దానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ గూడూరు సీతామాలక్ష్మి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి వాకర్స్ కు అవయవ దానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వారు అవయవాలు దానం చేయడం ద్వారా వారి అవయవాలు మరో శరీరంలో అమర్చుట ద్వారా పునర్జీవులు అవుతారని అలాగే ఎవరైనా మరణించిన వారి నేత్రదానం చేయడం ద్వారా మరొకరి ద్వారా ఈ ప్రపంచాన్ని చూసే భాగ్యం కలుగుతుందని, శరీర దానంతో వైద్య విద్యార్థుల జ్ఞానసమపార్జనకు సహకరించినట్లు అవుతుందని ఆమె అన్నారు. అవయవదాన అంగీకారం ఆన్లైన్ ద్వారా ఎవరికి వారే రిజిస్టర్ చేసుకునే సదుపాయం ఉందని అలా రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రభుత్వం వారే సర్టిఫికేట్ మంజూరు చేస్తారని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో పోర్ట్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles