34 వార్డులో క్రిస్మస్ వేడుకలు
* ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్
లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని, 34 వి వార్డ్ కొబ్బరితోట రెల్లి సంఘం నేత మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా వాసుపల్లి గణేష్ కుమార్ కు సాలువా కప్పి క్రైస్తవ సోదరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం క్రిస్మస్ వేడుక కేక్ ను కట్ చేసి క్రైస్తవ సోదరులకు, వైసిపి కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం వాసుపల్లి మాట్లాడుతూ మాట్లాడుతూ
క్రిస్మస్ పండుగ శాంతి, సంతోషం, త్యాగం మరియు కరుణకు ప్రతీక అని పేర్కొన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, అపారమైన సహనం మరియు క్షమాగుణం వంటి విలువలను క్రీస్తు మానవాళికి అందించారని, వాటిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లండ రమణ, లింగం శ్రీనివాస్, గరికిన వెంకటేష్, దూడ అప్పారావు, సిహెచ్ జ్యోతి, సూరడా లక్ష్మణ్ రావు (వైట్ ), దానియమ్మ, అంబతి అప్పలరాజు, ఎస్. నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.