2
భాగస్వామ్య సదస్సులు నిర్వహించిన ప్రతిసారీ అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, ఇన్ని లక్షల ఉద్యోగాలని చెప్పడమే తప్ప ఆచరణలో అది ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబునే తీసుకుంటే, తన హయాంలో ఏడు సమ్మిట్లు నిర్వహించానంటున్నారు. ఆయా సందర్భాల్లోనూ లక్షల కోట్ల పెట్టుబడులు, వేలు లక్షల ఉద్యోగాలని చెప్పారు. వైసిపి హయాంలోనూ ఇలాంటి హడావిడే కొనసాగింది. టిడిపి, వైసిపి ప్రచారం చేసుకున్నట్లు ఇబ్బడిముబ్బడిగా రాష్ట్రానికి పెట్టుబడులొచ్చి ఉంటే ఇప్పటికీ మన యువత హైదరాబాద్, చెన్నరు, బెంగళూర్, ముంబయి కేసి ఎందుకు పరుగులు పెడుతున్నట్టు? #cpim #CpimAp #vizagSteelPlant #chandrababu #TDP #PallaSrinivas #CBNOpportunist #OpportunistPartyTDP