16
విశాఖ జిల్లా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరాస శ్రీ దుర్గా వేమన సంక్షేమ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు, 90 వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కోడూరు గణపతి రావు, ప్రధాన కార్యదర్శి నరవ పైడిరాజు సారద్యంలో ఈ కమిటీ మూడు సంవత్సరాలు సేవలు అందించనుంది. కార్యవర్గ సభ్యులు సుమారు 50 మందికి నియామక పత్రాలను అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం వారంతా మాట్లాడారు..