కూటమిని గెలిపించిన కాపులకు ఇదేనా గుర్తింపు#vvwnews

by vvwnews.com

కూటమిని గెలిపించిన కాపులకు ఇదేనా గుర్తింపు
….
ఒక్కరోజు పోస్టింగ్‌తోనే బదిలీపై కాపు సేన ఆగ్రహం

కాపు అధికారులకు తీవ్ర అన్యాయం…

ఒక రోజు పోస్టింగ్ ఇచ్చి బదిలీయా…

ఆగ్రహం వ్యక్తం చేసిన కాపు సేన రాష్ట్ర అధ్యక్షులు బి.ఎన్.మూర్తి
విశాఖపట్నం : , ఏప్రిల్ 29 :  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో తమ కాపు ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని, నోటీసులు ఇవ్వకుండా బదిలీలు చేస్తున్నారని కాపు సేన రాష్ట్ర అధ్యక్షులు బండారు నారాయణమూర్తి (బి.ఎన్.మూర్తి) ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాపుల సమస్యలు, కాపులకు జరుగుతున్న  అన్యాయం గురించి బుధవారం ద్వారకా నగర్ పౌర గ్రంధాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ సిటీలో  ఏసిపి పోస్టుకు తమ కాపు కమ్యూనిటీ అధికారికి పోస్టింగ్ ఇచ్చి, ఒక్క రోజులో బదిలీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జీవో విడుదలైన ఒక్క నెలలో ఏ విధంగా క్యాన్సిల్ చేస్తారని ప్రశ్నించారు. అనంతపురంలో గత ప్రభుత్వ పాలనలో రాజకీయం పోరాటం చేసిన తమ కాపు నేతకు, పదవి ఇచ్చి తొలగించడం, కక్ష సాధింపులా ఉందని  అడిగారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కు తెలిసే జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. 2024లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రంలో కనివిని ఎరుగని రీతిలో ప్రతి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ గెలుపుకు కాపు నేతలుగా తాము కృషి చేశామన్నారు. 95 శాతం తమ కమ్యూనిటీ అంతా ఏకతాటిగా నిలబడి ప్రభుత్వం ఏర్పాటుకి ముఖ్య భూమిక పోషించామన్నారు.  కాపులంతా పవన్ కళ్యాణ్ ను సొంతం చేసుకొని,  ప్రభుత్వానికి మద్దతు తెలిపామన్నారు.  గెలిపించిన కాపులను పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాపు సేన గౌరవాధ్యక్షులు బి.ఎన్ మూర్తి మాట్లాడుతూ ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కాపులు బలంతోనే రావాలన్నారు. కాపులకు ప్రాధాన్యత ఇస్తారని, కాపులు రాజ్యం ఏలుతారని భావించి పవన్ కళ్యాణ్ కి కాపులు ఓట్లు వేస్తే, తమకు అన్యాయం చేశారన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ తమ కమ్యూనిటీని గుర్తించి ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కాపు సేన నేతలు గుర్రాల శ్రీనివాస్, రామ జోగి, మురళి తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles