మాటర్ ఏరా ఆరంగేట్రం – నగరానికి గేర్‌తో కూడిన ఎలక్ట్రిక్ మొబిలిటీ, తొలి ఎక్స్‌పీరియన్స్ హబ్ ప్రారంభం

by vvwnews.com

విశాఖపట్నంలో మాటర్ ఏరా ఆరంగేట్రం – నగరానికి గేర్‌తో కూడిన ఎలక్ట్రిక్ మొబిలిటీ, తొలి ఎక్స్‌పీరియన్స్ హబ్ ప్రారంభం

విశాఖపట్నం, 29 ఏప్రిల్ 2026 – భారతీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ మాటర్ మోటార్, విశాఖపట్నంలో భారతదేశపు తొలి గేర్ కలిగిన ఎలక్ట్రిక్ మోటర్‌బైక్‌ ‘మాటర్ ఏరా 5000+’ ను నగర రైడర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

పూర్తిగా భారతదేశంలోనే రూపకల్పన చేసి తయారు చేసిన ఏరా 5000+, భారతీయ రోడ్లు మరియు రోజువారీ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను అభివృద్ధి చేయాలన్న మాటర్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

ఈ బైక్‌లో ప్రధాన ఆకర్షణ హైపర్షిఫ్ట్ – ఇది ఎలక్ట్రిక్ మోటర్‌బైక్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రపంచంలోనే తొలి 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్. గేర్‌ల అనుభూతిని, ఎలక్ట్రిక్ పవర్ యొక్క వెంటనే లభించే టార్క్, సామర్థ్యం, నిశ్శబ్ద పనితీరుతో కలిపి, ఏరా నగర ప్రయాణాలకు మరింత నియంత్రణతో కూడిన డైనమిక్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

నగర ప్రవేశంలో భాగంగా, మాటర్ తన తొలి ఎక్స్పీరియన్స్ హబ్ ను ది బిజినెస్ సెంటర్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం – 530024లో ప్రారంభించింది. వినియోగదారులు మాటర్ యొక్క స్వంత ఎలక్ట్రిక్ మొబిలిటీ టెక్నాలజీని అనుభవించేందుకు, బైక్‌ను దగ్గరగా పరిశీలించేందుకు, టెస్ట్ రైడ్‌లు చేయేందుకు ఈ హబ్ ప్రత్యేకంగా రూపొందించబడింది.

ప్రారంభ ధర రూ.1.93 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించిన AERA బుకింగ్స్ ఇప్పుడు https://www.matter.in/⁠ లో అందుబాటులో ఉన్నాయి.

ప్రారంభోత్సవంలో మాటర్ ఫౌండర్ & గ్రూప్ సీటివో కుమార్ ప్రసాద్ తెలికేపల్లి మాట్లాడుతూ:
“భారతదేశవ్యాప్తంగా విస్తరిస్తున్న మా ప్రయాణంలో విశాఖపట్నం కీలక మార్కెట్. ఇది పరిశ్రమల అభివృద్ధి, రోజువారీ మొబిలిటీ అవసరాలు కలిసిన నగరం. ఇక్కడ ఏరా ను ప్రవేశపెట్టడం ద్వారా 400కు పైగా ఆవిష్కరణలతో కూడిన కొత్త రైడింగ్ అనుభవాన్ని అందిస్తున్నాం. గేర్‌ల పరిచయాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయోజనాలతో కలిపి మరింత ఆసక్తికరమైన, ప్రాక్టికల్ మరియు అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ రైడింగ్‌ను అందించడం మా లక్ష్యం” అని తెలిపారు.

డీలర్ ప్రిన్సిపల్స్ శ్రీ నరేష్ జైన్, శ్రీ మహావీర్ జైన్ మాట్లాడుతూ:
“విశాఖపట్నానికి మాటర్ ను తీసుకురావడం నగర మొబిలిటీ రంగానికి ముఖ్యమైన ఘట్టం. పనితీరు, విశ్వసనీయత, ప్రయోజనకరత కోరుకునే రైడర్లకు ఏరా పూర్తిగా కొత్త అనుభవం అందిస్తుంది. ఇది వినియోగదారుల్లో మంచి స్పందన పొందుతుందని మేము విశ్వసిస్తున్నాం. ఎక్స్‌పీరియన్స్ హబ్‌లో రైడర్లను ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నాం” అని అన్నారు.

ఏరా 5000+, లైఫ్-టైం బాటరీ వారంటీతో వచ్చిన భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ మోటర్‌బైక్. ఇది రోజువారీ ప్రయాణాలు, ఇంటర్‌సిటీ రైడ్లలో వినియోగదారులకు దీర్ఘకాల నమ్మకాన్ని అందిస్తుంది.
పవర్‌ట్రైన్, బ్యాటరీ, గేర్‌బాక్స్, సాఫ్ట్‌వేర్ అన్నింటినీ పూర్తిగా ఇన్-హౌస్‌లో అభివృద్ధి చేయడం ద్వారా మాటర్ నాణ్యత, పనితీరుపై పూర్తి నియంత్రణ సాధించింది. భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులు, రైడింగ్ అలవాట్లకు అనుగుణంగా రూపొందించిన ఏరా, విశాఖపట్నంలాంటి తీరప్రాంత నగరాల్లో కూడా విశ్వసనీయ పనితీరును అందిస్తుంది.

విశాఖపట్నంలో ఎక్స్‌పీరియన్స్ హబ్ ప్రారంభంతో మాటర్ దేశవ్యాప్త విస్తరణను వేగవంతం చేస్తూ, గేర్‌లు మరియు ఎలక్ట్రిక్ మొబిలిటీ కలిసే భవిష్యత్తు రైడింగ్‌ను నగరం నగరంగా పునర్నిర్వచిస్తోంది.

ఏరా 5000+ ముఖ్య ఫీచర్లు:
హైపర్షిఫ్ట్ గేర్‌బాక్స్ – 4-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 3 రైడ్ మోడ్‌లు
లిక్విడ్-కూల్డ్ పవర్‌ట్రైన్ – తీరప్రాంత, ఆర్ద్ర వాతావరణంలో స్థిరమైన పనితీరు
స్మార్ట్ 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్ – నావిగేషన్, మ్యూజిక్, రైడ్ డేటా, OTA అప్‌డేట్స్
5kWh బ్యాటరీ ప్యాక్ – 172 కి.మీ వరకు సర్టిఫైడ్ రేంజ్, IP67 రేటింగ్
5 Amp ఛార్జింగ్ – ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో ఎక్కడైనా ఛార్జ్, 1 లక్ష+ ఛార్జింగ్ పాయింట్లు
ఫాస్ట్ యాక్సిలరేషన్ – 0 నుండి 40 km/h కేవలం 2.8 సెకన్లలో
భద్రత & సౌకర్యం – డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ with ABS, డ్యూయల్ సస్పెన్షన్, పార్క్ అసిస్ట్
మాటర్ వర్స్ మొబైల్ యాప్ – లైవ్ ట్రాకింగ్, రిమోట్ లాక్/అన్‌లాక్, రైడ్ హిస్టరీ
స్మార్ట్ కీ: కీ లేకుండానే స్టార్ట్ మరియు అన్‌లాక్
తక్కువ నిర్వహణ వ్యయం – కిలోమీటరుకు కేవలం 25 పైసలు; మూడు ఏళ్లలో రూ.1 లక్ష వరకు ఆదా

Use Social Media to Spread the Word about Our News

related articles