మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన పెద్ద ఎత్తున !#vvwnews

by vvwnews.com

#Adminpost

విద్య ,వైద్యం ప్రజల కనీస హక్కు
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తోంది
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాం
వైయ‌స్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను గారు

ఈరోజు గౌరవ విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు,జడ్పీ చైర్మన్,భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)గారు విజయనగరం ధరంపురి తన క్యాంప్ కార్యాలయం అందు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సిపి పత్రిక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో చిన్న శ్రీను గారు మాట్లాడుతూ..

విద్య , వైద్యం ప్రజల కనీస హక్కు

ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తోంది

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాం

దీనికి సంబంధించి కోటి సంతకాల సేకరణ ఇప్పటికే మొదలయ్యింది , ప్రజలలో భారీ స్పందన వచ్చింది

అమరావతి నిర్మాణానికి ఒకవైపున వేల కోట్లు అప్పులు తెస్తున్నారు , మరొకవైపు గత 17 నెలల్లో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు , కానీ ఒక మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఈ ప్రభుత్వం ఎందుకు కేటాయించలేకపోతోంది ?

ఆరోగ్యశ్రీని ఆపేశారు , దీంతో పేదలు నానా అవస్థలు పడుతున్నారు , డయాలసిస్ పేషెంట్లకు దిక్కు లేకుండా పోయింది

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రతిసారి భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దకు వెళ్లి ఫోటోలు దిగి , 91 శాతం పనులు పూర్తి అయ్యాయని అసత్యాలు చెబుతున్నారు

మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి 2,203 ఎకరాల భూ సేకరణ చేసాం

527 నిర్వాసిత కుటుంబాలకు పరిహారాన్ని అందించాం , మా హాయంలో 23% పనులు పూర్తి చేశాం

ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి కొత్తగా ఏమైనా అనుమతులు గాని , నిర్మాణాలు గానీ చేపట్టిందా ?

గత మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అమలైన పథకాలకు పేర్లు మార్చడం , మా హాయంలో చేసిన పనులను టిడిపి నేతలు తమ ఖాతాలో వేసుకోవడం తప్ప ఈ 17 నెలల్లో వీరు చేసింది కొత్తగా ఏమైనా ఉందా ?

ఇటీవల సంభవించిన తుఫాన్ ధాటికి జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి , వాటికి సంబంధించి పంట నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయిలో అంచనా వేసి , ప్రభుత్వానికి నివేదించాలి

తడిచిన,రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి , గోనెసంచులను ప్రభుత్వమే రైతులకు అందించాలని కోరుతున్నాం అని అన్నారు.

#medicalcolleges
#AndhraPradesh
#vizianagaram

Use Social Media to Spread the Word about Our News

related articles