*ఎపి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సేవలు అభినందనీయం!*
*ఘనంగా 19వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు*
*నిరుపేదలకు అన్నదానం వస్త్రదానం పంపిణీ*
ఎపి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రముఖ సంఘ సేవకులు..ఎఎన్ బీచ్ ఆసుపత్రి అధినేత, ప్రముఖ వైద్యులు, డాక్టర్ సిఎంఎ జహీర్ అహ్మద్ కొనియాడారు. బుధవారం ఎపిడబ్ల్యూజెఎఫ్ 19వ వార్షికోత్సవం సందర్భంగా నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలోని వివేకానంద అనాధ.. వృద్ధుల ఆశ్రమంలో యూనియన్ నేతలు వస్త్ర దానం, అన్నదానం తదితర పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జహీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అతి పెద్దదైన జర్నలిస్ట్ సంఘంగా గుర్తింపు తెచ్చుకున్న ఎపిడబ్ల్యూజెఎఫ్ సభ్యులందరూ సమైక్యంగా ఉంటూ పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గత 19 సంవత్సరాలు నుంచి జర్నలిస్టుల సమస్యల సాధన పట్ల చిత్త శుద్ధితో పనిచేస్తూ మెజారిటీ జర్నలిస్టుల ఆదరణ పొందడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ పరిధి మేరకు నిరంతరం కృషి చేస్తున్నా మన్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం మంత్రులకు, ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు…