*డాక్ యార్డ్ ఉద్యోగులు ఆదర్శప్రాయులు*
*సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం*
*శాశ్వత సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ*
ప్రముఖ న్యాయవాది కే రామ జోగేశ్వరరావు
ఎన్ఏడి కొత్త రోడ్.. నవంబర్ 2
దేశ రక్షణ రంగంలో సేవలు అందిస్తున్న డాక్ యార్డ్ ఉద్యోగులు.. అధికారులు మరోవైపు సేవా రంగంలోనూ ముందు వరుసలో ఉండడం అభినందనీయమని ఏపీ బార్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ ప్రముఖ న్యాయవాది కే రామ జోగేశ్వరరావు కొనియాడారు. ఆదివారం
ఎన్ఏడి జంక్షన్.. కాకాని నగర్ కళాక్షేత్రంలో డాక్ యార్డ్ కే టి బి అసోసియేషన్ శాశ్వత సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. సమాజంలో ప్రతిభావంతులను సత్కరించడం.. అలాగే అధికారుల. ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ చేస్తున్న కృషి కూడా ప్రశంసనీయమన్నారు.. ఉద్యోగులంతా ఐక్యంగా ఉంటేనే ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోవడానికి అవకాశం కలుగుతుంది అన్నారు.. అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్న అధికారులకు .. ఉద్యోగులకు న్యాయపరంగా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. సభకు అధ్యక్షత వహించిన అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమానికి తమ కార్యవర్గం నిరంతరం కృషి చేస్తుందన్నారు.. ఇటీవలే సభ్యులు పిల్లలకు ప్రతిభకు ప్రోత్సాహం పేరిట ఉపకార వేతనాలు.. మెమెంటోలు అందజేశామన్నారు.. అలాగే రక్తదాన శిబిరాలు తో పాటు
ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు.. అసోసియేషన్ లో సభ్యులకు కార్యవర్గం నిరంతరం తగిన సహకారం అందిస్తుందన్నారు.. ఒకేసారి 60 మంది సభ్యులకు శాశ్వత సభ్యత్వ కార్డులు అందజేసినట్లు అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల చిరంజీవి విజనగరి భాస్కరరావువులు తెలిపారు.. అలాగే సాధారణ సభ్యులు కూడా పెద్ద మొత్తంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు.. తమ అసోసియేషన్ కు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి వీరు ధన్యవాదాలు తెలిపారు.. ఈ సందర్భంగా న్యాయవాది రామ జోగేశ్వరరావును కార్యవర్గం.. పలువురు పెద్దలు ఘనంగా సత్కరించారు..