ప్రచురణార్థం
శ్రీకాకుళం . నవంబర్ 1
ఇండోసోల్ కోసం గిరిజనులను బలి పెడతారా?
థర్మల్ ప్లాంట్ పై జిల్లా మంత్రి, స్థానిక MLA ప్రజలకు వాస్తవాలు చెప్పాలి
సిపిఎం డిమాండ్
పార్టీ
జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శివర్గ సభ్యులు కే మోహన్ రావు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇండోసోల్ కోసం సరుగుజిలి బూర్జ మండలాల్లో జెనకో పేరుతో భూసేకరణ ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేను కోరారు. థర్మల్ పవర్ ప్లాంట్ వలన రిజర్వాయర్ ఆరు టీఎంసీలు నీరుని పవర్ ప్లాంట్ కి ఇవ్వడం వలన శ్రీకాకుళం జిల్లా మారిపోతుందని ప్రజలు ఉపాధి కోల్పోయి వలసల బాట పడతారని వారు అన్నారు ధర్మల్ పవర్ ప్లాంట్ వల్ల బూడిదొస్తుందప్ప ఉపాధి రాదని ఎద్దేవా చేశారు. ఇండోసిల్ కంపెనీ కి వ్యతిరేకంగా కరేడులో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారని కోర్టు కూడా ప్రజలకి భూములకు నీరు ఇవ్వాలని చెప్పిందని గుర్తు చేశారు. ఇండోసల్ కంపెనీ గతంలో స్మార్ట్ మేటర్ కోసం ఒప్పందం చేసుకొని ఇవాళ రాష్ట్రాన్ని దోసుకుంటుందని అలాంటి కంపెనీనకి శ్రీకాకుళం జిల్లా ధారాధత్వం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు . వంశధార రిజర్వాయర్ నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వంశిధార రిజర్వాయర్ నీరు వెన్నెల వలస రిజర్వాయర్ నీరు ఇండోల్ సెల్ కంపెనీకి ఇస్తే జిల్లా రైతాంగం పరిస్థితి దుర్భరంగా మారుతుందని వారు అన్నార.
శ్రీకాకుళం జిల్లాకు తీరని ముప్పు ఏర్పడుతుందని అన్నారు. ఇండోసోల్ థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ఎందుకు వాస్తవాలు ప్రజలకు చెప్పడం లేదని వారు ప్రశ్నించారు. ఇండోసోల్ థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాల చేస్తారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండోసోల్ పవర్ ప్లాంట్ ప్రతిపదానా విరామించుకో లని డిమాండ్ చేశారు