ఎన్ని అడ్డంకులు సృష్టించినా పెద్ది సినిమా థియేటర్లలోకి రావడం ఖాయమని, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం పక్కా అంటూ నట్టి కుమార్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖ డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో సినీ నిర్మాత నట్టి కుమార్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో జరుగుతున్న అక్రమాలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మన శంకర వర ప్రసాద్ సినిమాను రిలీజ్ చేస్తానని చెప్పి, చివరి నిమిషంలో సత్యనారాయణ చేతులెత్తేశాడని.. డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఘోరంగా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ కోసం తామే డబ్బులు ఇచ్చామని.. నిజానికి సత్యనారాయణే తమకు డబ్బులు బాకీ ఉన్నాడని, కానీ రివర్స్ లో తనపైనే కేసు పెట్టాడని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో బత్తుల సత్యనారాయణ చాలా మందిని మోసం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీని దిల్ రాజు, శిరీష్ లు మాత్రమే ఏలాలని అనుకుంటున్నారని.. కొత్త డిస్ట్రిబ్యూటర్లు రాకుండా అడ్డుకుంటున్నారని నట్టి కుమార్ ధ్వజమెత్తారు. దిల్ రాజు, శిరీష్ ల వ్యవహారంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే కళ్ళు తెరవాలని డిమాండ్ చేశారు. మెగా ఫ్యామిలీ సినిమాలు విడుదలయ్యే సమయంలో కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారంటూ నట్టి కుమార్ ధ్వజమెత్తారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా పెద్ది సినిమా థియేటర్లలోకి రావడం ఖాయమని #vvwnews #news #ytshorts #lll
7