*పెందుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ( సీహెచ్‌సీ)లో 26 లక్షల రూపాయల విలువచేసే అల్ట్రాసౌండ్ స్కానింగ్ & ట్రూనాట్ ల్యాబ్ ప్రారంభించి హెచ్‌డీఎస్ సమావేశంలో పాల్గొని ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*
ఈ రోజు అనగా *06.06.2026* తేదీన పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం శనివారం ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా 26 లక్షల రూపాయలతో హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం మరియు ట్రూనాట్ మాలిక్యులర్ డయాగ్నస్టిక్ ల్యాబ్ యంత్రాన్న పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ చైర్మన్ శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం హాస్పటల్ సమావేశం మందిరంలో నిర్వహించిన హెచ్‌డీఎస్ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక వసతుల బలోపేతం, రోగులకు మెరుగైన సేవలందించేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం ద్వారా గర్భిణీ స్త్రీలు, మహిళలు మరియు ఇతర రోగులకు అత్యాధునిక నిర్ధారణ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే ట్రూనాట్ ల్యాబ్ యంత్రం ద్వారా క్షయవ్యాధి(TB), ఔషధ నిరోధక క్షయవ్యాధి, కోవిడ్-19 తదితర అంటువ్యాధులను వేగవంతంగా, ఖచ్చితంగా నిర్ధారించి సకాలంలో చికిత్స అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు అనంతరం 700 రూపాయలు విలువ చేస్తే పౌష్టికాహార పదార్థాలను టిబి రోగస్థులకు అందజేశారు ప్రజలకు మరింత సత్వర, నాణ్యమైన మరియు అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పెందుర్తి నిరంతరం కృషి చేస్తోందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ శ్రీ పీలా శ్రీనివాసరావు గారు, జిల్లా ఆరోగ్య సేవల సమన్వయ అధికారి డా. ఆర్. నరేంద్ర సింగ్ గారు, హెచ్‌డీఎస్ సభ్యుడు మరియు కన్వీనర్, మెడికల్ సూపరింటెండెంట్ డా. హెచ్.ఆర్.కె. డోరా గారు, జోనల్ కమిషనర్ శ్రీ హెచ్. శంకరరావు గారు, పెందుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నెంబర్ బండారు వరుధిని నాయుడు గారు, పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ అయిత సింహాచలం గారు, ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్ మంతా నాగ సుధా గారు,హాస్పిటల్స్ సిబ్బంది డా. టి. అరుణాదేవి, డా. ఆర్. అవంతి, డా. బి. బాబా సాహెబ్, డా. రవి కృష్ణ తదితర వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, హెచ్‌డీఎస్ సభ్యులు మరియు స్థానిక వార్డు అధ్యక్షులు పెంటకోట రాజేంద్రప్రసాద్ గారు,మండల పార్టీ అధ్యక్షులు కురుపోలు రామనాయుడు గారు, పెందుర్తి ఏఎంసి డైరెక్టర్ ఆర్ఎస్ నాయుడు గారు, లక్కీ గోవింద గారు, కోరుబిల్లి సంతోష్ కుమార్ గారు, హైమావతి గారు,దాట్ల మధు గారు, గొర్లి అప్పారావు గారు, కర్రి శివ గారు, అంబటి వెంకటేశ్వరరావు గారు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.