, ప్రచురణార్థం 6/6/26
*స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి*
*ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ డిమాండ్*
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐరన్ ఓర్ గనులను విశాఖ ఉక్కుకు కేటాయించాలని . నేడువిశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఆఫీస్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద 18 94 వ రోజు కు చేరిన నిరసన దీక్షలో పాల్గొన్న ఏఐటీయూసీ కార్యకర్తలు రాష్ట్రంలో ఉ న్న ఐరన్ ఓర్ గనులను రాష్ట్ర ప్రభుత్వం జిందాల్ స్టీల్ ప్లాంట్ కేటాయించడాన్ని వ్యతిరేకించండి, స్టీల్ ప్లాంట్ ప్రవేట్కరణ ఆపాలి సొంత గనులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను గడచిన పది రోజులలో నాలుగు సార్లు పెంచడానికి ఖండించాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో కొనిజర్ల, మర్లపాడు తదితర ప్రాంతాలలో ఉన్న ఐరన్ ఓర్ నిక్షేపాలను విశాఖ ఉక్కు కేటాయించకుండా ప్రైవేట్ జిందాల్ స్టీల్ ప్లాంట్ కు కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్రంలోని గన్నులను విశాఖ ఉక్కుకు కేటాయించమని గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం గనులను కేటాయించకుండా కాలయాపన చేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగే ముందు రాష్ట్రంలోని గనులను విశాఖ ఉక్కుకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణ గోదావరి బేసన్ లో లభ్యమవుతున్న గ్యాస్ నిక్షేపాలను రిలయన్స్ ప్రైవేట్ సంస్థ తన ధనార్ధనలో 30% దీని నుంచే వస్తుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో లభ్యమవుతున్న గ్యాస్ 50% రాష్ట్రంలో వినియోగిస్తే 200 రూపాయలకే గ్యాస్ ప్రజలకు లభ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రపంచ సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రంలోని బిజెపి ఎప్పుడు లేని విధంగా 10 రోజులలో నాలుగు సార్లు గ్యాస్ పెట్రోల్ డీజిల్ రేట్లనుపెంచిందని ఆయన అన్నారు. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నింటి ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ టాక్స్ లను కొద్దిగా తగ్గించుకుంటే వీటి ధరలు కొంత వ్యత్యాసం ఉంటుందని ఆయన వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజలపై భారాలుగా ఉన్న గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జే రామకృష్ణ మాట్లాడుతూ స్టీల్ కార్మికుల తప్పు లేకుండా యాజమాన్యం తక్కువ జీతాలపై కోతలు చేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. వీరికి న్యాయంగా చెల్లించాల్సిన ఆర్ధిక ప్రయోజనాలను ఒకటొకటిగా తీసివేస్తూ ఆర్థికంగాను మానసికంగా
ఒత్తిడికి గురి చేస్తోందని ఆయన వివరించారు. కార్మికుల హక్కుగా ఉన్న వేతనం, హెచ్ఎస్ఏ, ఎల్ టి ఏ, లీవ్ ఎన్కాష్మెంట్, ఉక్కు నగరంలో విద్యుత్ చార్జీలను తగ్గించాలనే డిమాండ్లను యాజమాన్యం పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కే సత్యనారాయణ. ఎన్ శ్రీను. సాహిత్. రామ నాయుడు బి రమణ. ప్రొఫెసర్ సూరప్పుడు పాల్గొన్నారు