మన ఆరోగ్యం కోసం విత్తనాల బంతులు తయారు చేయండి #vvwnews

by vvwnews.com

మన ఆరోగ్యం కోసం విత్తనాల బంతులు తయారు చేయండి అని భారత ప్రజారోగ్య వైద్యులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మురళీ మోహన్ పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం ఎం విపి కాలనీ లో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం ఇంటి వద్ద విత్తనాల బంతులు తయారు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశీయ విత్తనాలతో విత్తనాల బంతులు తయారు చేయాలి అని కోరారు. పర్యావరణ పరిరక్షణ మానవాళి బాధ్యతని గుర్తు చేశారు. మనిషి భూమి మీద ఉన్న జీవులు గూడు లో ఒక భాగం మాత్రమే అని, ఈ జీవులు గూడు లో ఏ జీవి అంతరించినా దాని వల్ల కలిగే నష్టం మానవాళికే అని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి అని కోరారు. సామాజిక వనాలు పెంచి కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించుదాం అని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి విత్తనాల బంతులు తయారు చేసి ప్రజలను విత్తనాల బంతులు తయారు చేయడం ద్వారా సామాజిక వనాలు పెంచి పర్యావరణ పరిరక్షణ కోసం మార్గం చూపించారని అన్నారు. 40 సంవత్సరాలుగా తాను విత్తనాల బంతులు తయారు చేయడం జరిగుతోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏక్షన్ ఎయిడ్ ప్రతినిధి ఐ కృష్ణ కుమారి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ సమన్వయకర్తలు జె రాజేశ్వరి, జె రవితేజ, సామాజిక సేవకులు శ్రీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles