ఆరాదని ట్రస్ట్ 30 ఏళ్లగా త్యాగరాజ ఆరాదన ఉత్సవాలు #vvwnews

by vvwnews.com

త్యాగరాజ ఆరాదన ట్రస్ట్ విశాఖపట్నం.

36- 5/1/2026

ఆరాదని ట్రస్ట్ 30 ఏళ్లగా త్యాగరాజ ఆరాదన ఉత్సవాలు మూడు రోజులతో ప్రారంభించి ఇప్పుడు ఏడు రోజులు పాటు నిర్వహిస్తున్నాం అని కార్యదర్శి తెలియజేశారు. ఇందులో ప్రతి సంవత్సరం వెయ్యికి పైగా కళాకారులు పాల్గొనడం చాలా గొప్ప విషయం అని ఇప్పుడు సంగీతం నేర్చుకునే వారు ఎక్కువ అవ్వడం వల్ల అనేక అప్లికేషన్స్ వచ్చినప్పటికీ వీలైనంతమందికి అవకాశం కల్పిస్తూ కొన్ని అప్లికేషన్స్ సమయాభావం వల్ల పక్కన పెట్టవలసి వచ్చిందన్నారు.

ఈ ఉత్సవాలు జనవరి 6 నుంచి జనవరి 12 వరకు 7 రోజులు పాటు జరుగుతాయన్నారు. జనవరి ఏడవ తారీబు పుష్య బహుళ పంచమీ అయినందున ఆ ముందు రోజు అంటే 6వ తారీఖున సాయంత్రం 6:16 కు ప్రారంభ సభ ఉంటుందడే దానికి ముఖ్యఅతిధిగా పద్మశ్రీ డాక్టర్ ఎల్ల వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారని అన్నారు.

ప్రారంభ సదలో డాక్టర్ గౌరీ రామ్మోహస్ రావు గారికి “సంగీత కళాభారతి” బిరుదు ప్రదానం ఉంటుందని ప్రారంభ సభ అనంతరం డాక్టర్ ఆర్ మాదురి దేవి దర్శకత్వంలో నాలుగు vinalu గాత్ర కళాకారులతో కలిపి త్యాగరాజ కృతయులతో ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని, రెండవ రోజు అంటే ఏడవ తారీఖు ఉదయం పుష్య పంచమి నాడు త్యాగరాజ స్వామి వారి 179వ వర్ధంతి సందర్భంగా కళాభారతి ప్రాంగణంలో ఉన్న త్యాగరాజ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించి అది రోజు తిరువీది సీతారాముల లక్ష్మణ హనుమ విగ్రహాలను పల్లకి మీద పెట్టి కళాభారతి చుట్టూ ఊరేగింపుగా వందలాది మంది కళాకారులు త్యాగరాజస్వామి కీర్తనలు గానం చేస్తూ ఉండగా తిరువీధి కార్యక్రమం నిర్వహించి తదనంతరం కళాభారతి వేదిక మీద నిండుగా సుమారుగా 200 పైన కళాకారులతో ఘనరాగ పంచకృతులను బృంద గానం ఉంటుంది. ఆ వెంటనే కచేరి గురువుల అప్పన్న మంగళ నాదస్వర వాద్యంతో ప్రారంభమై ఆరాధన కచేరీలు 10 నిమిషాలు 15 నిమిషాలు 30 నిమిషాలు వ్యవదిలో ఉదయం నుండి రాత్రి వరకు నిర్విరామంగా జరుగుతాయి

Use Social Media to Spread the Word about Our News

related articles