కంచరపాలెం 48 వార్డు ఇందిరానగర్-1 లో దళిత సేన ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా

by vvwnews.com

భారతదేశ సామాజిక చరిత్రలో మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే అని దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొల్లమాల అప్పారావు అన్నారు. కంచరపాలెం 48 వార్డు ఇందిరానగర్-1 లో దళిత సేన ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్త్రీలు చదువుకోవడం అపరాధంగా భావించిన కాలంలో, అణచివేతకు గురైన వర్గాలకు విద్య అనే ఆయుధాన్ని అందించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె చరిత్రలో నిలిచారన్నారు. ఆమె చేసిన సాహసం మహిళలను విద్యావంతులుగా చేయడమే కాకుండా పురుషులకన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసేలా తీర్చిదిద్దిందారు అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిటీ కన్వీనర్ గొల్లమాల మీనా, సిటీ ప్రెసిడెంట్ పుచ్చ కామేశ్వరరావు, మోర్తా గణేశ్వరరావు, యాదగిరి పవన్, ప్రేమ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles