రాష్ట్ర మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.

by vvwnews.com

కర్నూలు…

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కామెంట్స్…

రాష్ట్ర మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.

మహిళల ఆత్మగౌరవం కాపాడుతామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నారు? రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిస్తున్నారు. రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు ఏమి చేస్తున్నారు. రజినీ పీఏపై అక్రమ కేసులు నమోదు చేయడం ఏమిటి? మహిళా మాజీ మంత్రి అని కూడా చూడాకుండా పోలీసులు చేయి పట్టుకోవడం దారుణం. పాకిస్థాన్ టెర్రరిస్టులగా విడదల రజిని,ఆమె పీఏపై పోలీసులు వ్యవహరించారు. కేవలం తెలుగు దేశం పార్టీ రెడ్ బుక్ లో ఉన్నారని పోలీసులు ఈ విధంగా వ్యహరిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు తీసుకొచ్చినందుకు సీఐ సుబ్బరాయుడిపై చర్యలు తీసుకోవాలన్నారు. అతి ఉత్సాహం తో పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇది ఇలాగే రెడ్ బుక్ పాలన కొనసాగితే, వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో బుక్ తో సిద్ధం అవుతారు. ఎంపీటీసీ కల్పన పై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళలను పోలీస్ స్టేషన్ లో ఎలా పెడుతారు. అమె దుస్తులు మార్చుకుంటామని చెప్పిన ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు. భారత దేశంలో ఒక్క పక్క పాకిస్థాన్ తో యుద్ధం జరుగుతుంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. 84 సంవత్సరాల మాజీ ఎమ్మెల్యే చెన్నకేశరెడ్డి పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అసభ్యకరమైన వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసుల తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విడదల రజినీపై జరిగిన దుశ్చర్యపై న్యాయపోరాటం చేస్తాం. నారా లోకేష్ మెప్పు కోసం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలో ఇలాంటి పోలీసులతో చెడ్డ పేరు వస్తుంది. అనుచితంగా ప్రవర్తించిన సీఐ సుబ్బారాయుడు పై చర్యలు తీసుకోవాలి, అరెస్టు చేయాలి లేదంటే న్యాయ పోరాటానికి సిద్ధం అవుతాము. ప్రజల్లో పోలీస్ వ్యవస్థ పై చెడ్డ పేరు వస్తుంది. తక్షణమే జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలి, అదృశ్యం అయ్యారు అన్న మహిళలను కూటమి ప్రభుత్వం తీసుకొని రావాలి. ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మహిళల మిస్సింగ్ కేసులను చేధించాలి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. సంక్షేమ పథకాలు ఇవ్వాలని ప్రశ్నించిన వ్యక్తులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోంది. పోసాని కృష్ణమురళి పై 16 అక్రమ కేసులు నమోదు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోను తిప్పి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఇలాంటి చర్యలపై ప్రజలు తగిన బుద్ధి చెబుతారు….

Use Social Media to Spread the Word about Our News

related articles